ఆర్య వర్ధన్ కు లభించిన బలమైన సాక్ష్యం ఏంటది?
on Jun 29, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె కీలక జంటగా నటించారు. ఇతర పాత్రల్లో జయలలిత, బెంగళూరు పద్మ, జ్యోతిరెడ్డి, రామ్ జగన్, విశ్వమోహన్, రాధాకృష్ణ, అనూషా సంతోష్, కరణ్, మధుశ్రీ, ఉమాదేవి, సందీప్ తదితరులు నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఆద్యంతం చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతూ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. బుధవారం ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని జడ్జి ఆర్య వర్ధన్ కు ఒక్క రోజు గడువు ఇస్తాడు. ఇదే సమయంలో ఆర్య వర్థన్ ని మళ్లీ పోలీస్ కష్టడీకి అప్పగించడానికి మేను ఒప్పుకోమంటూ బస్తీ వాసులు పోలీస్టేషన్ ని ముట్టడిస్తారు. ఆర్య ఎంత చెప్పినా వినరు.. అదే సమయానికి అక్కడకు వచ్చిన అను.. ఇదంతా తన వల్లే జరిగిందని చెప్పి ఈ ఒక్కసారికి నా మాట వినండి అంటుంది. దీంతో బస్తీ జనం శాంతిస్తారు. ఆర్య కు దారిస్తారు. స్టేషన్ లోకి వెళ్లిన ఆర్యతో పాటే అను కూడా వెళ్లి జరిగిన దానికి కుమిలిపోతూ వుంటుంది.
ఇక్కడే ఆర్య అసలు ప్లాన్ ని అనుకి వివరిస్తాడు. తాను చెప్పినట్టు చేస్తే రాగసుధని కట్టడి చేయోచ్చని చెబుతాడు. వెంటనే ఇంటికి వెళ్లిన అను ఆర్య ప్లాన్ ప్రకారం ఫాలో అవుతుంది. కట్ చేస్తే.. కోర్టులో లాయర్ రాగసుధపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటాడు.. రాగసుధ ఫస్ట్ మీరు ఆర్య వర్ధన్ గారి ఆఫీసులోకి ఎంటరయ్యారు కదా అంటాడు.. రాగసుధ అవును అంటుంది.. దేనికి అని అడిగితే...మా అక్కని చంపింది ఆర్య వర్థన్ అని నిరూపించే ఆధారాలు తన ఆఫీస్ లోనే వున్నాయనే అనుమానంతో ఆఫీస్ లో చేరాను అంటుంది... కానీ మీకు ఆధారాలు దొరికింది ఎస్టేట్ గోడౌన్స్ లో అని పోలీస్ కంప్లైంట్ లో వుందే.. అని లాయర్ అనడంతో రాగసుధ దొరికిపోయానా అని భయపడుతుంది.. దీంతో అలెర్ట్ అయిన రాగసుధ లాయర అబ్జెక్షన్ అంటూ ముందుకొస్తాడు.. మా దగ్గర తన తప్పుని ప్రూవ్ చేసే ఆధారాలు లేక కాదు..ఆర్య వర్ధన్ గారింట్లోని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని రాగసుధ కొట్టేసింది అనడానికి నా దగ్గర సాక్ష్యం వుంది..ఇదుగో ఇదే ఆ సాక్ష్యం అంటూ జడ్జిగారికి పెన్ డ్రైవ్ ని అందజేస్తాడు ఆర్య వర్థన్ లాయర్.. ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది? .. అందులో వున్న బలమైన సాక్ష్యం ఏంటీ? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read